22 May, 2026 | 6:24 PM

ఉద్యమపోరులో మేం సైతం!

22-08-2024 12:00 AM

ఆదిలాబాద్.. తెలంగాణ మలిదశలో కీలక భూమిక పోషించిన జిల్లా. నిజానికి వయసు పైబడి..  పదవి విరమణ తర్వాత ఏం చేస్తారు? చక్కగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు.. కానీ ఆదిలాబాద్ ఉద్యమపోరులో మేం సైతం అంటూ విశ్రాంత ఉద్యోగులు ఉద్యమ అవసరాన్ని చాటి చెప్పారు. సకల జనులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని దీక్ష కొనసాగించారు. 1,523 రోజులు నిర్విరామంగా కొనసాగిన దీక్ష శిబిరం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం జరిగిన పోరాటంలో ఆదిలాబాద్‌లో ని విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత పోరాటం చేశారు. ఉద్యోగ పదవి విరమణ తరాత తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులు, మనమలు మనవరాళ్లతో సరదాగా గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో వృద్ధులమని వెనకడుగు వేయకుండా ఉరకలేస్తూ ఉ ద్యమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంత భవనం ఆవరణంలో తెలంగాణ రాష్ర్ట సాధన కోసం చేప ట్టిన 1,523 రోజుల పాటు జరిగిన దీక్ష శిబిరం లో విశ్రాంత ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉవెత్తున ఎగిసిపడుతున్న  ఉద్యమాల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక ఆకరణగా నిలిచింది. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా అదిలాబాద్ జిల్లాలో జరిగిన సుదీర్ఘ పోరాటంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన దీక్ష శిబిరానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒకటి కాదు రెం డు కాదు ఏకంగా 1,523 రోజుల పాటు నిరిరామంగా కొనసాగిన  దీక్ష శిబిరానికి ఆల్ టైం రికార్డు సాధించింది. ఇన్ని రోజులు సాగిన ఉ ద్యమంలో ఎక్కువ శాతం విశ్రాంత ఉద్యోగులు ప్రతినిత్యం వహించడం విశేషం. ఉద్యోగానికి వెళ్లే సమయంలో ఎలాగైతే సమయపాలన, క్ర మశిక్షణ పాటించేవారో తెలంగాణ ఉద్యమం లో సైతం అంతే క్రమశిక్షణగా పాల్గొని రాష్ర్ట సాధనలో తమ వంతు పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన పోరాటంలో ఆదిలాబాద్ జిల్లా విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత పోరాటం చేశారు. 1,523 రోజులపాటు జరిగిన దీక్ష శిబిరంలో ఎక్కువ శాతం రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. దీక్ష శిబిరం నిరాకులు రిటైర్డ్ పీజీ హెచ్.ఎం కారింగుల దామోదర ఆధర్యంలో కొనసాగిన దీక్ష శిబిరానికి ప్రతిరోజు వివిధ హోదాల్లో రిటైర్మెంట్ అయిన విశ్రాంత ఉద్యోగులు దీక్షలో పాల్గొనేవారు. కోరెడ్డి శివన్న, కస్తాల సుధాకర్, రామయ్య, భూపతి, శ్రీధర్, కిష్ణయ్య, ఆదినాథ్, డాక్టర్ డి.ఎన్ సామి, నరసింహులు, లక్ష్మారెడ్డి,  కేశవ సామి, లింబగిరి సామి, మహేంద్ర నాథ్ యాదవ్, భూమన్న, బండ గంగన్న, గోవర్ధన్ సామి ప్రకాష్ ఇలా ఎంతోమంది ప్రభుత రిటైర్డ్ ఉద్యోగులు ఈ దీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  

 ఆదిలాబాద్, విజయ క్రాంతి

క్రమశిక్షణగా పోరాటం చేశాం..

ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎలాగైతే పాఠశాలకు, ఆయా కార్యాలయాలకు వెళ్లే మాదిరిగానే తెలంగాణ ఉద్యమంలో సైతం అంతే క్రమశిక్షణగా ఉత్సాహంగా దీక్ష శిబిరాంలో పాల్గొన్నాం. దీక్ష శిబిరం జరిగిన 1,523 రోజుల్లో  ఎందరో విశ్రాంత ఉ ద్యోగులు పాల్గొని  ఇతరులను ప్రోత్సహించే వాళం. పాఠశాలకు, కార్యాలయాలకు వెళ్లే మాదిరిగానే ఉదయం పది గంటలు అయిందంటే చాలు దీక్ష శిబిరానికి వచ్చి సాయంత్రం వరకు దీక్షలో పాల్గొనేవాళ్లం. పదవీ విరమణ చేసిన తరాత  కుటుంబ సభ్యులతో సాగే శేషజీవితంలో కొంత సమయాన్ని తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమానికి వెచ్చించడం ఎంతో గరంగా, సంతోషంగా ఉంది.

 శిబిరం నిరాహకులు కారింగుల దామోదర్