అరుంధతి నగర్‌లో త్వరలో సీసీ రోడ్డు ప్రారంభం
సికింద్రాబాద్ బీజేపీ జాయింట్ కన్వీనర్ వినయ్‌కుమార్
ముషీరాబాద్, జూలై 25 (విజయక్రాం తి): గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్ బస్తీలో గత ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న నూతన సీసీ రోడ్డు నిర్మా ణ పనులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ చేసిన కృషి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌ఎం డబ్ల్యూఎస్ అండ్ ఎస్ బి అధికారుల సహకారంతో పనులకు మంజూరు లభించిందని చెప్పారు. బోనాల పండుగ నాటికి బస్తీవాసులకు కొత్త సీసీ రోడ్డు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బస్తీవాసులు, రోడ్డు కాంట్రాక్టర్తో కలిసి పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎం. ఉమేష్, ఆనంద్ రావు, శ్రీనివాస్ గౌడ్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, బి. ప్రకాష్, శ్రీనివాస్, సీహెచ్ రాజు, ఎన్. ప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.






