calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూసెన్స్ చేస్తే కేసులు నమోదు చేస్తాం

20-08-2025 12:03:36 AM

టౌన్ ఏసీపీ రమణమూర్తి

ఖమ్మం, ఆగస్ట్ 19 (విజయ క్రాంతి): బహిరంగ మద్యపానం, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం, పని లేకున్నా రోడ్లపై రావడం, పుట్టినరోజు వేడుకలు రోడ్డుపై వాహనాలు అ డ్డం పెట్టిపబ్లిక్ న్యూసెన్స్ చేస్తే సిటీ పోలీసు యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని టౌన్ ఏసీపీ రమణమూర్తి మంగళవారం ఒ క ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలోనే ఖమ్మం డివిజన్ లో 38 కే సులు నమోదు చేసి 167 మంది గంజాయి బ్యాచ్ లను గుర్తించి, 114 మందిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వారి నుండి 11 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చోరీ కేసులను చేదించేందుకు మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు.

చోరీ సంఘట నా స్థలంలో లభించిన ఆధారాల మేరకు త్వ రితగతిన కేసు ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పే ర్కొన్నారు.నగరంలోని పలు ప్రాంతాలలో రికార్డు అయిన సిసి కెమెరాల పుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

గంజాయి సరఫరా, విని యోగన్ని సమూలంగా నియంత్రించేందుకు నగరంతో పాటు శివారులో ప్రాంతా లలో డి విజన్ పోలీసుతో పాటు టాస్క్ ఫో ర్స్, సిసిఎస్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు.