calender_icon.png 20 August, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక మండప నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి

20-08-2025 12:03:50 AM

జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం

జగిత్యాల అర్బన్,ఆగస్టు19 (విజయ క్రాంతి) : వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తయారీ కేంద్రాల నుండి మండపాలకు విగ్రహాల రవాణా కార్యక్రమం కొనసాగుతోందని, వి ద్యుత్ తీగల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం అన్నారు. హైదరాబాద్, కామారెడ్డి వంటి కొన్ని ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

ఇప్పటికే విద్యుత్ శాఖ పలు ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ఉ న్న తీగల సమస్యను పరిష్కరించినప్పటికీ, ఇంకా ఇలాంటి సమస్యలు ఏవైనా మిగిలి ఉంటే, తక్షణమే సంబంధిత అధికారులకు, 1912 లేదా 8712486131 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చే సారు.తక్కువ ఎత్తులో ఉన్న ఇంటర్నెట్, కేబుల్ తీగలు కూడా విగ్రహాల రవాణాకు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో సంబంధిత ఇంటర్నెట్/కేబుల్ ఆపరేటర్ వారు తమ తరఫున తొలగించాల్సిందిగా కోరారు.

అదే సమయంలో విద్యుత్ స్తంభాలపై వాడుకలో లేని కేబుల్ తీగలను కూడా తక్షణమే తొలగించాలన్నారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోకపోతే, ప్రజల భ ద్రత దృష్ట్యా విద్యుత్ శాఖ స్వయంగా వాటిని తొలగించాల్సి ఉంటుందన్నారు.