రూ.1.29 కోట్ల నగదు జప్తు
జిల్లా రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్
మంథని, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పెద్దపలి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.1.29 కోట్లను జప్తు చేసినట్టు పెద్దపల్లి పార్టమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ మ్మిల్ ఖాన్ తెలిపారు. వీటిలో ఆధారాలు చూపించిన రూ.1.29 కోట్లు విడుదల చేసినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రామగుండం సెగ్మెంట్‌లో రూ.21.28 లక్షలు, మంథని సెగ్మెంట్‌లో రూ. 6.81లక్షలు, పెద్దపల్లి సెగ్మెంట్‌లో రూ.10.5 లక్షలు, ధర్మపురి సెగ్మెంట్‌లో రూ.26.76 లక్షలు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. చెన్నూర్ సెగ్మెంట్‌లో రూ.5.49 లక్షలు, బెల్లంపల్లి సెగ్మెంట్ లో రూ.45.56లక్షలు, మంచిర్యాల సెగ్మెంట్‌లో రూ.13.72లక్షలు సీజ్ చేయగా ఆధా రాలు పరిశీలించి కొంత సొమ్మను విడుదల చేసినట్టు తెలిపారు. సరైన ఆధారాలు సమర్పించని కారణంగా రూ.4.7 లక్షలు విడుద ల చేయలేదని కలెక్టర్ తెలిపారు.




