రాహుల్ దెబ్బకు దిగొచ్చిన మోదీ, అమిత్ షా

30-04-2024 02:10:06 AM

అందుకే రిజర్వేషన్ల రద్దుపై మాట మార్చారు

కేసీఆర్ రోడ్ షోల పేరుతో రోడ్డున పడ్డారు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దెబ్బకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగమాగమవుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే.. బీజేపీ రద్దు చేస్తామని చెబుతోందని ఆరోపించారు. అదే విష యాన్ని రాహుల్ గాంధీ ప్రజలకు వివరించగానే  బీజేపీ దిగొచ్చిందని, మాట మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తామనలేదని చెబుతోందని జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. రాజ్యాంగం అవసరమా అనే చర్చను బీజేపీనే తీసుకొచ్చిందని, అదే ఇప్పుడు ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చిందని అన్నారు.

తెలంగాణలో బీజేపీకి దెబ్బపడుతుందనే భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. ఎండలకు తట్టుకోలేక ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉనప్పుడు బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు రోడ్ షోల పేరుతో రోడ్డున పడ్డారని విమర్శించారు. భువనగిరి నియోజకవర్గానికి చెందిన గోద శ్రీనివాస్ గౌడ్, రాహుల్ గౌడ్, చిన్నం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశా న్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు వెల్లడించారు.