03-07-2025 02:12:35 AM
పాత పాలకవర్గమే కొనసాగింపు
ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
తిమ్మాపూర్,జూలై 2 (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని సీతారామ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చైర్మన్ గా బండారిపెల్లి లక్ష్మణ్ తిరిగి నియామకమయ్యా రు. లక్ష్మణ్ తోపాటు గత పాలకవర్గాన్నే కొనసాగిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బం డారిపెల్లి లక్ష్మణ్ తదితరులకు ఉత్తర్వులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధే ధ్యేయంగా ఆలయ పాలకవర్గం పని చేయాలన్నారు.
గతేడాదిలో పాలకవర్గం పనితీరు ఆధారంగానే ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నామని, సంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కవ్వంపల్లి మహేశ్, జినుక శ్రీనివాస్, గోలి లక్ష్మి, కందుకూరి లక్ష్మిరాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతిరెడ్డి, రొడ్డ సాగర్,చిట్టి బాబు, సురేందర్ రావు తదితరులుపాల్గొన్నారు.