18-06-2025 04:45:01 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) ప్రధాన రహదారిపై రాకపోకలకు అడ్డుగా తిరుగుతున్న పశువులను బుధవారం మున్సిపల్ సిబ్బంది బంజరు దొడ్డికి తరలించారు. మున్సిపల్ సిబ్బంది అనేకసార్లు యజమానులకు సూచించినప్పటికీ పశువులను రోడ్డుపై వదిలివేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, చేసేది లేక బుధవారం పశువులను బంజరు దొడ్డికి తరలించామని మున్సిపల్ సూపర్వైజర్ మానాల శంకర్ తెలిపారు.