11-09-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి
రాజన్నసిరిసిల్ల: సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) కాళేశ్వరం ఆవినీతిని బయటపెట్టేం దుకేసిబిఐ ఎంక్వైరీ. పెట్టారు. కాళేశ్వరం ప్రా జెక్ట్ కట్టి కేసీఆర్ ఫ్యామిలీ రూ లక్షలు దోసుకున్నరు. ఈ ప్రాజెక్ట్ లో కేసీఆర్ ఫ్యామిలీ కో ట్ల రూపాయలు. సంపాదించారని కేటీఆర్ చెల్లెలు కవితనే చెప్తున్నారు. ముందుగా కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని’ రాష్ట్ర కార్మిక, భూగర్భ జలములు శాఖ మం త్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
కవిత మా టలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నారని వివేక్ చెప్పారు. బుధవా రం ఆయన సిరిసిల్ల జిల్లాకేంద్రంలో జరిగిన సకల జనుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. డిజే సప్పుళ్లతో ర్యాలీ ని ర్వహించారు. అనంతరం లహరి గ్రాండ్ ఫం క్షన్ హాల్లో జరిగిన సకల జనుల సన్మాన కా ర్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గోని మాట్లాడారు.కమీషన్ల కోసమే కాళేశ్వ రం ప్రాజెక్ట్ కట్టారని, ప్రాణహిత చేవేళ్ల స్కీం లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రూ.11వేల కోట్లు ఖర్చుపెట్టి 20 టీఎంసీల నీటితో హైద్రాబాద్ సిటికి త్రాగు నీరు సప్లై చేసింది.
మరో 24వేల కోట్లు ఖర్చుపెడితే ప్రాణహిత చేవేళ్ల కు సంబందించి అన్ని ప్రా జెక్టులు పూర్తియ్యేవి.గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం కమీషన్లను దోచుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టారు. అసలు తమ్మిడిహట్టిలో నీళ్లు లేకుంటే కాళేశ్వరం లో నీళ్లు ఎలా ఉం టాయని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. కానీ 50టీఎంసీలతో మల్లన్న సాగర్ ను ఎందుకు నిర్మించినట్టు అని వివేక్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఇ ంతపెద్ద రిజర్వాయర్ ను ఎక్కడ కట్టలేదన్నారు.
కేసీఆర్ ఫాంహౌజ్ కు, కొండాపో చమ్మకు నీరు తీసుకుపోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు.ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ క ట్టింది.ప్రస్తుతం మల్లన్న సాగర్ కు కూడ ఎల్లంపల్లి నుంచే నీటిని తీసుకుపోతున్నారుకాని కాళేశ్వరం నుంచి కాదని వివేక్ చెప్పా రు. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం పాలనలోనే కూలిందన్నారు. కేసీఆర్ కుటుం బం ఆవినీతిలో కూరుకుపోయిందనే ప్రజ లు వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వి వేక్ చెప్పారు.యువకుల బలిదానాలు చూసే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. గతంలో సిరిసిల్లలో తెలంగాణ కోసం బలిదానం అయిన వారి కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించామన్నారు.
ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నా సంక్షేమ పథకాలు అమలు
రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికే రాష్ట్ర పరిస్థితి అంతంతే ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని వివేక్ చె ప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం జారీ చేనే గ్యారంటీ కార్డు ద్వారా 200 యూ నిట్ల విద్యుత్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్య స్కీం కింద రూ పదిలక్షలు ,500 రూపాలకే గ్యాస్ స బ్సీడీ అందజేస్తూ పేదల పక్షనా కాంగ్రెస్ పా లన ఉంటోందన్నారు.అడ్వాన్స్ టెక్నాలజీతో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఇప్పటికే యు వతకు 60వేల ఉద్యోగాలు కల్పించామని, రానున్న కాలంలో 2లక్షలు ఉద్యో గాలు భర్తీ చేస్తామన్నారు.
గతంలో సిరిసిల్లలో సాండ్ మాఫియా
గత ప్రభుత్వ హాయాంలో కేటీఆర్ ఇలాఖా సిరిసిల్లలో సాండ్ మాఫియా నడిచింది.సిరిసిల్ల ఇలాఖాలో సాండ్ మాఫియా నడిచింది.ఈ సాండ్ మాఫియా వల్ల సిరిసిల్లలో దళితులు హిసించబడ్డారు.ఇసుక దం దాపై కఠినంగా వ్యవహరిస్తాం.సిరిసిల్లలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి ని గెలిపించుకోవాలన్నారు. ప్రస్తుతం నేను సిద్దిపేట, గజ్వెల్ లలో కాంగ్రెస్ పార్టీ ని బలో పేతం చేస్తున్నానన్నారు.కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు.
నాన్న వెంకటస్వామి బాటలో నడుస్తా
‘నేను ఎక్కడికి వెళ్లినా మా నాన్నా వెంకటస్వామి చేసిన సేవలు గుర్తుచేస్తుంటారని, నేను ఆయన బాటలోనే నడిచి ప్రజలకు మంచి సేవలందిస్తానని వివేక్ చెప్పారు. గ డ్డం వెంకటస్వామి నుంచి గుడిసెల వెంకటస్వామిగా మా నాన్న పేరు సంపాదించుకు న్నారని చెప్పారు. ఆయన స్పూర్తితో నేనూ ప్రజలకు మేలు చేస్తానని చెప్పారు.సిరిసిల్ల లో జౌళిశాఖ కార్మికులను కాకా వెంకటస్వా మి ఆదుకున్నారని సిరిసిల్ల నాయకులు చెప్తున్నారు.
అదే స్పూర్తి మున్ముందు సిరిసిల్ల కా ర్మికులకు ఉంటుందని వివేక్ చెప్పారు.కార్యక్రమంలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, సిరిసి ల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కే కే మహేందర్ రెడ్డి, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగు ల రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నా గుల సత్యనారాయణ,కాంగ్రెస్ పట్టణాధ్యక్షు లు చొప్పదండి ప్రకాష్, నాయకులు ఆకునూరి బాల్రాజ్,కత్తెర దేవదాస్,కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.