calender_icon.png 11 September, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగుపల్లిలో శ్రీ సంజీవని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ సీజ్

11-09-2025 08:53:17 AM

గ్రామాల్లో అనుమతులు లేకుండా జోరుగా నడుస్తున్న మెడికల్ క్లినికల్.. వైనం.

అనుమతులు లేని వాటిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న ప్రజలు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): అనుమతులు లేకుండా నడిపిస్తున్న క్లినిక్ ను సూర్యాపేట జిల్లా వైద్యాధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు అందిస్తున్న క్లినికల్ ను సీజ్ చేశారు. తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలోఎలాంటి అనుమతులు లేకుండా సర్గం సంపత్ కుమార్ శ్రీ సంజీవని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడిపిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో తనిఖీ నిర్వహించామనీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయ మనోరి ,డాక్టర్ జి చంద్రశేఖర్ తెలిపారు.

సంపత్ కుమార్ తమ అర్హతకు మించి ఇంజక్షన్లు గ్లూకోజులు రోగులకు అందిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అనధికారికంగా చికిత్స చేయడం నేరమని అన్నారు. రిజిస్టర్లను రిఫరల్ స్లిప్పులను స్వాధీనం చేసుకొని క్లినిక్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా వైద్యసేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనుమతులు లేకుండా నడిపిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా తబాస్సుం ,జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.