calender_icon.png 11 September, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు- ఆటో ఢీ

11-09-2025 09:59:43 AM

- పలువురు కూలీలు విద్యార్థులకు తీవ్ర గాయాలు 

 తెలకపల్లి మండలంలో ఘటన 

 నాగర్ కర్నూల్ (విజయక్రాంతి ): కూలీలను విద్యార్థులను తరలిస్తున్న ప్యాసింజర్ ఆటో కారు ఎదురెదురుగా ఢీకొనడంతో(Road Accident) పలువురు కూలీలు విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండలం గోలగుండం గ్రామ శివారులో చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. ప్యాసింజర్ ఆటోలో వ్యవసాయ కూలీలతో పాటు విద్యార్థులను ఎక్కించుకొని తెలకపల్లి వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఆటో పంట పొలాల్లో మల్టీ కొట్టింది ఈ ఘటనలో సుమారు పదిమందికి పైగా విద్యార్థులు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.