calender_icon.png 11 September, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

11-09-2025 08:56:09 AM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను, ఉదృతం చేస్తాం

టీఎస్ జెఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి.

తుంగతుర్తి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు(Working journalists) అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకుల కమిటీల సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ దయానందం కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో,నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని కోరారు. ప్రెస్ క్లబ్ సొంత భవనాలు లేక జర్నలిస్టు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నుండి వేళల్లో లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి ప్రత్యేక సౌకర్యాలు పొందుకుంటున్నారని గుర్తు చేశారు.అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉచిత సేవ చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం చెప్పండి సరేంది కాదన్నారు. ప్రభుత్వాలు కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలను గుప్పెట్లో పెట్టుకొని ఆయా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి తమ బాధ్యత తీరింది అనుకోవడంప్రభుత్వ బాధ్యతారహిత విధానంతో ఉండడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఆసుపత్రి సేవలు అందుకునే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసేవి విషయంలో జాప్యం చేయకుండా వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.తమ సమస్యలు పరిష్కరించే అంతవరకు అన్ని యూనియన్ల కమిటీ సభ్యులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఓరుగంటి శ్రీనివాస్  కొరివి సతీష్ యాదవ్ ,షేక్ దస్తగిరి టుడే న్యూస్,ఇరుగు సైదులు పల్లా సత్యనారాయణ సుభాష్ , కొమ్మ గాని సైదులు గౌడ్ , యాతాకుల మధుసూదన్ పోతురాజు వెంకన్న రామకృష్ణ గుండ గాని రాము ,కొండా రవి యాకన్న  ఎస్కే జానీ  చింతకుంట్ల సైదులు  తదితరులు పాల్గొన్నారు.