calender_icon.png 11 September, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

11-09-2025 12:00:00 AM

- ఆలయ టికెట్లు ఇక ఆన్లైన్ లోనే 

- ఆలయానికి 500 మీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ నిషేధం

- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, సెప్టెంబర్10(విజయ క్రాంతి) ఓదెల శ్రీ.మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించిన తదుపరి ఆలయ అ భివృద్ధి కోసం తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఆలయ పరిసరాలను పరిశీ లించారు.

అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే కు కలెక్టర్ కు పూ ర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ లకు అర్చకులు స్వామివా రి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వచనాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నెలరోజుల్లోగా ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం రేవం త్ రెడ్డి ని కలిసి నిధులను మంజూరు చే యించేందుకు కృషి చేస్తామన్నారు.

ఆల యం పరిసరాలలో 500 మీటర్ల లోపు భూ ములలో నిర్మాణాలు గానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గాని చేయరాదన్నారు. ఆలయ భవిష్యత్తు అవసరాల కోసం అందరు సహకరించాలని, జిల్లాలోని ఈ అతిపెద్ద ఆలయా న్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఆలయ ప్రిన్సెస్ లో రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ డివైడర్ లను నిర్మిస్తామన్నారు. ఓదెల ఆలయానికి సంబం ధించి అన్ని రకాల టికెట్లను ఇక ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఒగ్గు పూజారుల కోసం ఆలయ టికెట్లపై ఆదాయాన్ని 25 శాతం నుండి 35 శాతానికి పెం చి అందించనున్నట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధికి పూర్తి పారదర్శకతో పని చేయాలని ఆయన పాలకమండలికి సూచించారు. ఆల య అభివృద్ధికి పూర్తి వ్యవస్థీకృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీ కట్ల మొండయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షు డు ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఈవో,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.