మార్చి 31 లోపు అన్ని సంఘాలకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామీణ బ్యాంకులో ఐకెపి ఆధ్వర్యంలో సిబిఆర్ఎం సమావేశం నిర్వహించడం జరిగిందని మండల ఇన్చార్జ్ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ ఏపిఎం రామనారాయణ గౌడ్ మాట్లాడుతూ... మహిళా సంఘాలు బ్యాంకు మధ్య సమన్వయంతో ఏర్పాటు చేసిన సిబిఆర్ఎం (కమ్యూనిటీ బేస్ రికవరీ మెకానిజం) ధర్మారెడ్డి గ్రామీణ బ్యాంకులో ఏర్పాటు చేసి ఈ సమావేశంలో గ్రామీణ బ్యాంకు పరిధిలోని మహిళా సంఘాలు తీసుకున్న రుణాల చెల్లింపు విధానం ఎన్పీఏ రికవరీ, నూతన రుణాలు తదితర అంశాల గురించి చర్చించడం జరిగిందనీ తెలిపారు.
ఈ సందర్భంగా 31 మార్చిలోపు గ్రామీణ బ్యాంకు పరిధిలోని అన్ని సంఘాలకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలని అదేవిధంగా అన్ని సంఘాల నుంచి మొండి బకాయలు వసూలు చేయాలని ఐకేపీ ఏపీఎం రాంనారాయణ గౌడ్,టిజిబి మేనేజర్ జ్ఞానేశ్వర్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సిసిలు దత్తు, రవి, రషీద్, సావిత్రి, వివోఏలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.




