సీసీ రోడ్డు.. మధ్యలో చెట్టు
07-02-2025 12:11 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 6 : రోడ్డు అంటేనే సాఫీగా వెళ్లే మార్గం. మధ్యలో చెట్లు, రాళ్లు ఉంటే తొలిగించి, రోడ్డు వేస్తారు. కానీ హయత్‌నగర్ డివిజన్‌లోని గాయత్రినగర్‌లోని ఒక వీధిలో సీసీ రోడ్డు మధ్యలో భారీ వృక్షం ఉన్నది. చెట్టును తొలిగించకుండానే సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. దీనిని చూసిన స్థానికులు ముక్కన వేలు వేసుకుంటున్నారు.






