అధునాతన ఆయుధాలపై అవగాహన పెరగాలి
- మెదక్ పోలీసులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
- జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈనె 3వ తేదీ నుండి 6 వ తేది వరకు సిద్దిపేట్ జిల్లా రాజ్ గోపాలపేటలో ఉన్నఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను జిల్లా ఎస్పీ డి.
ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించి సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అందులో జిల్లా ఎస్పీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఫైరింగ్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినదించారు.
ఈ శిక్షణలో బాగంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, తూప్రాన్ డీఎస్పీ ఎస్.వెంకట్ రెడ్డి, మెదక్ డీఎస్పీ ప్రసన్న, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






