మొక్కల పెంపకం సామాజిక బాధ్యత
టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్
కూకట్‌పల్లి, జూలై 25 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని టిపిసిసి ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చై ర్మన్ బండి రమేష్ అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిది వసంత నగర్ డివిజన్ గోపాల్ నగర్ కాలనీ పార్క్ వద్ద సాయిబా బా చౌదరి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భం గా బండి రమేష్ మొక్కలు నాటి, కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చని కూకట్పల్లి, పచ్చని హైదరాబాద్ లక్ష్యంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరు కనీసం నాలుగైదు మొక్కలను నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ డైరెక్టర్ రోహిత్, అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ వసంత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస బాబు, అరవింద రెడ్డి, నాయకులు రంగమోహన్,శివ, రామకృష్ణ, ప్రవీణ్, సత్యనారాయణ, రామారావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






