31 May, 2026 | 6:47 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

మాతుసంగెం గ్రామంలో రూ.20 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభం

08-04-2026 12:43 AM

గాంధారి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతుసంగెం గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆదేశాల మేరకు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు సర్పంచ్ మాదోజి వందన బల్వంత్ రావ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రాబోయే వర్షాకాలంలో ఎదురయ్యే బురద సమస్యలు తీరుతాయని అన్నారు.

గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ముకుంద్ రావు, సంగరావు, బల్వంత్ రావ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.