31 May, 2026 | 7:35 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

అక్రమ సెల్ టవర్‌పై ఉద్రిక్తత

08-04-2026 12:43 AM

చర్లపల్లి ఈసీ నగర్‌లో యువకుడు టవర్ ఎక్కి నిరసన

కుషాయిగూడ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) : మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్ కాలనీలో జిహెచ్‌ఎంసి పార్కు పక్కనే అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాలనీకి చెందిన ప్రణ య్ కుమార్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

సమాచారం అందుకున్న చర్లపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని కిందికి దించేందుకు ప్రయత్నించినప్పటికీ, అతను టవ్పనే ఉండి నిరసన కొనసాగించాడు. కాలనీవాసులు ఆరోపిస్తూ కాలనీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు ఆనంద్ రాజు, సత్తిరెడ్డి సెల్ టవర్ యజమానితో కుమ్మక్కై గత పది రోజులుగా రహస్యంగా నిర్మాణం కొనసాగించారని మండిపడ్డారు.

సెల్ టవర్‌ను పూర్తిగా తొలగించేంతవరకు తమ ఆందోళనను విరమించబోమని కాలనీవాసులు స్పష్టం చేశారు. సెల్ టవర్ సమస్యకు పరిష్కారం చూపుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రణయ్ కుమార్‌ను సెల్ టవర్ నుంచి కిందికి దిగాడు. దీంతో కాలనీ ప్రజలంతా ఊపిరి పీచుకున్నారు సెల్ టవర్‌ను ఈసీ నగర్ కాలనీ నుండి ఎత్తివేసేంతవరకు ఆందోళన కార్యక్రమాలను విరవించబోమని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.