9 July, 2026 | 3:36 AM

రూ.4 కోట్లతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

09-07-2026 01:41 AM

సంగారెడ్డి, జూలై 8 : టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.4 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 11వ వార్డులోని శిల్పా వెంచర్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం 33వ వార్డు, 28 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను సైతం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ  జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి మున్సిపాలిటీలో పనులు ప్రారంభమవుతున్నాయని, మరిన్ని నిధులతో ప్రతీ వార్డులో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రఘు రాథోడ్, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.