9 July, 2026 | 3:57 AM

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

09-07-2026 01:41 AM

చొప్పదండి, జూలై 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

గంగాధర మండల కేంద్రానికి చెందిన చిరుత మంగ రమేష్ తన అనుచరులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, గంగాధర ప్రజా కార్యాలయంలో కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి మూడు రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తోట కరుణాకర్ ,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ముద్దం నగేష్,సర్పంచ్ రేండ్ల శ్రీనివాస్, వేముల భాస్కర్, పడాల రాజన్న,మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు,కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, వేముల అంజి,కర్ర బాపురెడ్డి,కంకణాల రాజగోపాల్ రెడ్డి, బుర్గు గంగన్న శంకరయ్య, చిదం శ్రీధర్, గంగినేని నవీన్,గడ్డం జానీ దాతు అంజి, తాళ్ల శ్రీనివాస్, జారతి సత్తయ్య, దూలం అంజయ్య, ఐలయ్య, సంపత్, కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.