28-10-2025 09:16:02 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంగళవారం నాడు బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటికి బయలుదేరారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణించిన నేపథ్యంలో ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యక్రమాలను కేటీఆర్ రద్దు చేశారు. ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలు రద్దు చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు. వయో సమస్యల కారణంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు.
ఆయన మృతికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపింది. తన్నీరు సత్యనారాయణ(Thanneeru Satyanarayana Passed Away) పార్థివదేహం సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయి. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కేంద్రమంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.