13-02-2026 12:00:00 AM
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాలు నిర్వహించిన కార్యకర్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరం ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని భూపతిరెడ్డి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుమారు 300 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూలసని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగా ధర్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు మెట్టు సాంసంన్, ధర్మ గౌడ్, డాక్టర్ షాదుల్లా, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నరసయ్య, డిచ్‌పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, సర్పంచులు కోట్ల భాస్కర్, ఖర్జూరం కిరణ్, ఎడ్ల ప్రవళిక వినోద్, తేనేటి హేమలత లక్ష్మణ్, సుదం శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఖాదర్ బాబా పాల్గొన్నారు.