14-11-2025 07:46:00 PM
నూతనకల్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లల నవీన్ యాదవ్ భారీ విజయాన్ని సాధించడంతో శుక్రవారం నూతనకల్ మండలం లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.నవీన్ యాదవ్ 24658 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన వార్త తెలియగానే, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నూతనకల్ ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు. వారు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కాంగ్రెస్ పార్టీ జెండాలను చేతబూనిన కార్యకర్తలు,యువకులు డ్యాన్స్‌లు చేస్తూ, ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు.నవీన్ యాదవ్ గెలుపు నూతనకల్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న,పాల్వాయి నాగరాజు,మండల నాయకులు గుణగంటి వెంకన్న,వేల్పుల వెంకటమల్లు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.