14 June, 2026 | 2:23 PM

Breaking News

తుమ్మన్‌పేటకు బయలుదేరాం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తాం   •   పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్   •   అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం   •   వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ   •   శ్రీ ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు   •   బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి   •   మహిళల టీ20 ప్రపంచకప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు   •   ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన   •   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు   •   అయ్యగారి చెరువు సుందరీకరణ కోసం, రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేయాలి   •  

అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం

14-06-2026 01:32 PM

* తడిసిన ధాన్యం మిల్లులకు చేరవేత 

* యూరియా కొరత లేకుండా పటిష్ట చర్యలు

అచ్చంపేట,(విజయక్రాంతి): తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్య పడద్దని వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ భరోసా కల్పించారు. అదివారం ఉప్పునుంతల మండలం పెద్దాపూర్, లక్ష్మాపూర్ లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తడిసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా వెంటనే బాయిల్  మిల్లులకు తరలించాలని.. అవసరమైన రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సివిల్ సప్లైస్, ఐకేపీ, మెప్మా అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రక్షించాలని  చెప్పారు.

ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, జాప్యాలు జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతంగా తూకాలు చేయాలన్నారు.  రైతులకు చెల్లింపులు  సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

* యూరియా కొరత లేకుండా చర్యలు

రైతులు వర్షాకాల సాగు సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువుల లభ్యతపై కోరత లేకుండా చూడాలన్నారు.గతంలో కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈసారి ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కొరత తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ విధానంలోనే యూరియా పంపిణీ జరిగేలా వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

అవసరమైన నిల్వలను ముందుగానే సమకూర్చి ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగు సలహాలు అందించడంలో నిర్లక్ష్యం  వహించవద్దని సూచించారు.  వర్షాకాల వ్యవసాయ సీజన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, రైతులకు అవసరమైన సేవలు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.