calender_icon.png 7 May, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణవభక్త సమాజం శతాబ్ది ఉత్సవాలు

07-05-2025 12:33:19 AM

 23 నుంచి మూడు రోజులపాటు వేడుకలు

 రాజేంద్రనగర్, మే 6: సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ హైందవ నగర్ ప్రణవభక్త సమాజం శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భక్త సమాజం నిర్ణయించింది. ఈనెల 23వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయని వెల్లడించింది.

ఈ ఉత్సవాల ఏర్పాట్లుకు సంబంధించి మంగళ వారం ఉదయం హైదర్‌గూడ గాంధీభవన్‌లో భక్త సమాజం అధ్యక్షుడు మొండ్ర నరసింహ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రణవభక్త సమాజం ఆవిర్భవించి 105 సంవత్సరాలు పూర్తవుతున్న క్రమంలో  పంచోత్తర శత జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లోకకళ్యాణం కోసం, దేశ భద్రత కోసం నిత్యం హోమాలు, వేద పండితులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ప్రత్యేక భజన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భజన మండలి ప్రతినిధులను, పండితులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ శతాబ్ది ఉత్సవాలలో ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమావేశం లో ప్రణవభక్ష సమాజం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.