07-05-2025 12:32:41 AM
చేగుంట, మే 6 :కారు ఢీకొని మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన నార్సింగ్ మండలం వల్లభాపూర్ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. వల్లభాపూర్ క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా రామాయంపేట నుండి చేగుంట వెళ్తున్న టీఎస్ 17 6667 మారుతి ఈకో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వల్లభాపూర్ గ్రామానికి చెందిన మారవ్వ (40) అనే మహిళ మృతి చెందింది. అలాగే రుక్మాపూర్ గ్రామానికి చెందిన రామయ్య, మృతురాలి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.