09-01-2026 10:05:19 AM
పత్రికా యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలను బహిర్గతం చేస్తూ పరిష్కరించేందుకు దారి చూపిస్తున్న విజయ క్రాంతి దినపత్రిక తక్కువ సమయంలోనే అత్యధికంగా జనాదరణ పొందుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మూఢ కార్యాలయంలో విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరములు మరింతగా పాఠకులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ జిల్లెల రఘు, అడ్డాకల్ రిపోర్టర్ శేఖర్, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.