calender_icon.png 10 January, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు

09-01-2026 10:08:24 AM

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

హుజూర్ నగర్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.గురువారం పట్టణంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు...ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై బిఆర్ఎస్ పార్టీని గెలిపించారు అని త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమై బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు.తెలంగాణకు కెసిఆర్ శ్రీరామరక్ష అన్నారు.బిఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి పదంలో నిలిచాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమని మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే ప్రబలిస్తుందన్నారు. అడుగడుగునా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలైందని, మరోసారి బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించటం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు,నియోజకవర్గ కార్మిక విభాగ అధ్యక్షులు  పచ్చిపాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.