09-01-2026 10:02:30 AM
మూడ లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అభివృద్ధికి మూడ దిక్సూచిగా మారుతూ దిశా నిర్దేశం చేస్తుందని ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక ఘట్టంగా ముడా (మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) లోగోను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి,జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి,దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ ఈ లోగో కేవలం ఒక గుర్తు మాత్రమే కాకుండా, ప్రణాళికాబద్ధమైన పట్టణ విస్తరణ, ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, ప్రజల అవసరాలకు అనుగుణమైన అభివృద్ధి అనే లక్ష్యాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముడా ద్వారా మహబూబ్‌నగర్ నగరాన్ని శాశ్వత అభివృద్ధి మార్గంలో నడిపించాలనే ప్రభుత్వ సంకల్పం ఈ ఆవిష్కరణలో ప్రతిఫలించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.