09-01-2026 09:59:13 AM
బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల : ఫిబ్రవరి 3న బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) రానున్నారని స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. గురువారం హైస్కూల్ శతాబ్ది ఉత్సవ కమిటి రూపొందించిన లోగోను ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిషరించారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3న ట్రిపుల్ ఐటి కళాశాల భవన శంకుస్థాపనకు సీఎం రానున్నారని, ముందుగా హైస్కూల్ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఐఐఐటి శంకుస్థాపన చేస్తారన్నారు.
అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. ఉత్సవాలు జయప్రదం చేసేందుకు తనవంతుగా పూర్తి సహాకారం అందిస్తానని, ఉత్సవ కమిటి, పాఠశాల ఉపాధ్యాయ బృందం సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. ఉత్సవాలకు సీఎంతో పాటు ముగింపు వేడుకలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వనిద్దామన్నారు. సమీక్ష సమావేశంలో ఉత్సవ కమిటి అధ్యక్షుడు రవిశంకర్, పరింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణ, ప్రధానకార్యదర్శి రమణాచార్యులు, ఆహ్వనకమిటి సభ్యులు ఎంఈఓ మంజులాదేవి, గోవింద్ నాయిక్, ప్రదానోపాధ్యాయురాలు చంద్రకశ, కమిటి సభ్యులు జయప్రకాష్, ఆకుల వెంకటేశ్, సూరి, మేడిశెట్టి రామకృష్ణ,కంచుకోట ఆనంద్,శ్రీహరి, సంతోష్, సూరి, రాజుగౌడ్, టైటాస్, సునీల్, శంకర్ లు పాల్గొన్నారు.