calender_icon.png 2 August, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైపాస్‌రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ వెలుగులు

02-08-2025 01:07:30 AM

  1. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రూ.4 కోట్ల 60 లక్షల నిధులతో పనులు

ప్రారంభించిన కలెక్టర్, కే కే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1(విజయక్రాంతి) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు కుడివైపు బైపాస్ లో సెంట్రల్ లైటింగ్ వెలుగులు అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ సందీప్ కు మార్ ఝా తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ కు ఉన్న రోడ్డులో 11 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను శుక్రవారం కే కే మ హేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ కు ఉన్న రో డ్డులో రగుడు, చంద్రంపేట, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూర్ వరకు సెంట్రల్ లైటింగ్ పను లు పూర్తి చేశారు. సీడీఎంఏ నిధులు రూ.4 కోట్ల 60 లక్షలతో మొత్తం పొడవు 11 కిలోమీటర్లు విస్తీర్ణంలో మొత్తం 437 స్తంభాలు, నాలుగు హై మాస్ట్ స్తంభాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు.

దీంతో బై పాస్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నా రు. పనులు త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.