02-08-2025 01:05:59 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 1 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరం పరిధిలోని రేకుర్తిలోగల డి-93 కెనాలకు ఆనుకొని ఉన్న సీసీ రోడ్డుపై ఒక ఇంటి యజమాని బోర్ వేశా డు. స్థానికులు ఫిర్యాదు చేసినా ఇటు నగరపాలక సంస్థ అధికారులుకాని, డి-93 లస్కర్లు కాని పట్టించుకోలేదు. సీసీ రోడ్డును తవ్వి బోర్ వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి బోరు వేసినవారిపై చర్యలు తీసు కోవాలని స్థానికులు డిమాండ్‌చేస్తున్నారు.