26 July, 2026 | 1:44 AM

విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం

26-07-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నాయకుడు జైసింహ

ముషీరాబాద్, జూలై 25(విజయక్రాంతి): విద్యార్థుల ఉధ్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిం దని అందువల్లే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ పేర్కొన్నారు. శనివారం ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా ప్రజల ఒత్తిడి ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ప్రజాస్వామ్యంలో భారీ విజయం సాధించామని అన్నారు.

న్యాయం కోసం విద్యార్థులు బీఆర్‌ఎస్ తో పాటు వివిద పార్టీల నేతలు పోరాటాలు చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించడంతో పాటు, విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసిందని అన్నారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దీన్ దయాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఇన్చార్జి శ్రీనివాస్ గుప్తా, డివిజన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, వల్లాల శ్యామ్ యాదవ్, రాకేష్ కుమార్, భోలక్ పూర్ డివిజన్ మాజీ అద్యక్షుడు మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.