26 July, 2026 | 2:13 AM

ట్విన్ ఐడియా.. కలుపు హోగయా!

26-07-2026 12:00 AM

జత ఎద్దులు.. రెండు నాగళ్లు 

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఒక జత ఎడ్లతో రెండు నాగండ్లు ఏర్పాటుచేసి తక్కువ సమయంలో పత్తి చేనులో కలుపు తీసేందుకు ఓ రైతు వినూత్న విధానం తో శభాష్ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా ఒక జత ఎడ్లతో నాగలి కట్టి దున్నుతా రు. ఇందుకు భిన్నంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కోరుపోలు గ్రామంలో నరసింహులు అనే రైతు జత ఎడ్లకు పొడవాటి ‘కాని’ కట్టి మధ్యలో రెండు ‘గుంటుక’లు అమర్చాడు. మరో కూలిని వెంటపెట్టుకొని తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంటలో కలుపుతీసి, సాగుఖర్చులు తగ్గించుకుని అందరిచేత మెప్పు పొందుతున్నాడు.