ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కమిటీ
పంజాగుట్ట, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శులు నెమలి ఆనంద్, మేకల సారంగపాణి, ఉపాధ్యక్షు లు నిమ్మల ఆనంద్,కోదండ నాగేశ్వర్ రెడ్డి తదితరులు హాజరై ఆయన తో కలిసి మాట్లాడారు..
రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో వారి ఉన్నత విద్యకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాయని, కానీ ప్రస్తుతం రూ. 15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు అన్ని వర్గాల విద్యార్థులకు బకాయిలు చెల్లించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితిన్ నందా ,బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిహరిప్రసాద్, కార్యదర్శిగార్ల మల్లేష్, మీడియా కన్వీనర్ అనిల్ ,జిల్లా ఐటీ కన్వీనర్ ఆశ్విని, బీజేపీ అధికార ప్రతినిధి నాగభూషణం రెడ్డి, మాజీ కార్పొరేటర్ సరళ, బీజేపీ నాయకులు మహేష్, హరిప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






