11-05-2025 12:00:00 AM
క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయి. ముందే సర్వైకల్ క్యాన్సర్ గుర్తించలేకపోవడంతో ప్రతిఏటా ఎంతోమంది మహిళలు వీటి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఒకటి సర్వైకల్ క్యాన్సర్. దీనికి టీకాలు, పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహనలేమితో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని తొలిదశలో గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు డాక్టర్ పూజిత రెడ్డి గోదాల.
సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్.. మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో నాలుగోది. మన దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో నాలుగో వంతు, మరణాల్లో మూడో వంతు మన దేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎలా వస్తుంది?
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పివి) కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుంది. కానీ.. రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5-10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భ నిరోధక ట్యాబ్లెట్స్ ఉపయోగించడం.. వంశపారంపర్యంగా, ధూమపానం.. ఇలా తదితర కారణాలతో ఇది సంక్రమించే అవకాశముంది.
పరీక్షలు..
ఈ క్యాన్సర్ లక్షణాలు కన్పించగానే దాన్ని నిర్ధరించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనదది ‘పాప్‌స్మియర్’ టెస్టు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతోపాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధరించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు.
నివారించడం ఎలా?
* వ్యాక్సిన్ ద్వారా మహిళల అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు
* తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించడం ద్వారా 90శాతం విజయవంతంగా నిర్మూలించవచ్చు.
* వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంజెక్షన్ చేసిన చోట కొద్దిగా ఎర్రబడటం, తలనొప్పి, టెంపరేచర్ పెరగడం వంటి సాధారణ దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
* టీనేజర్లు భయానికి గురికావడం వల్ల కొన్నిసార్లు స్పృహ తప్పే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.
వ్యాక్సినేషన్ తప్పనిసరి!
* ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9-26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. 9-14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తున్నది కేంద్ర ప్రభుత్వం.
* సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకూడదంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో హెచ్‌పీవీ వైరస్ సోకుండా ముందస్తు వ్యాక్సినేషన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. దీన్ని 9 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు వేయించడం వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.
* అలాగే 21 ఏళ్లు దాటాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవడం కూడా ముఖ్యమే.
* అసురక్షిత శృంగారంతోనూ సర్వైకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా కండోమ్స్ వంటి సురక్షిత గర్భనిరోధక పద్ధతులు పాటించడం మంచిది.
* అత్యవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ సలహా మే రకు గర్భనిరోధక మాత్రలు వాడాలి. దీనివల్ల కూడా వ్యాధి ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు.
* వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యా యామాలు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరచ డంలో సహకరిస్తాయి. ఫలితంగా సర్వైకల్ క్యా న్సరే కాదు.. ఇతర వ్యా ధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.
లక్షణాలు
* ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
* లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా మెనోపాజ్ దశలోనూ బ్లీడింగ్ అవుతుంది.
* దుర్వాసనతో కూడిన వ్జునల్ డిశ్చార్జి.. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత వ్జునా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది.
* పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించాలి.
డా.పూజిత రెడ్డి గోదాల,
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఓజోన్ హాస్పిటల్స్,
హైదరాబాద్, కొత్తపేట