calender_icon.png 14 May, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీకోర్టు ముందస్తు బెయిల్

14-05-2025 02:34:58 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Former BRS Armoor MLA Jeevan Reddy)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ భూ ఆక్రమణల కేసులో జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టు(Supreme Court) ముందస్తు బెయిల్ ఇచ్చింది. మొయినాబాద్ భూ ఆక్రమణల కేసులో(Moinabad land encroachment case) జీవన్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని జీవన్ రెడ్డికి హైకోర్టు గతంలోనే ఆదేశించింది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు జీవన్ రెడ్డికి సూచించింది. జీవన్ రెడ్డి(Jeevan Reddy) విచారణకు సహకరించకుంటే అధికారులు చర్యలు తీసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.