calender_icon.png 14 May, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా దిగొచ్చిన పసిడి

13-05-2025 12:00:00 AM

  1. పది గ్రాములకు రూ.3,400 తగ్గుదల
  2. రూ.96,550 ట్రేడయిన ధర
  3. అమెరికా మధ్య టారిఫ్ యుద్ధానికి బ్రేకులు పడటంతో సానుకూల ఫలితాలు

న్యూఢిల్లీ, మే 12: కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న పసిడి ధరలు.. క్రమంగా తగ్గుతున్నాయి. అమెరికా మధ్య టారిఫ్‌లకు 90 రోజుల పాటు బ్రేక్ పడిన నేపథ్యంలో పసిడి ధర భారీగా తగ్గింది. కొన్నిరోజులుగా అంతర్జాతీయ విపణిలో 3400 డాలర్ల ఎగువన ట్రేడ్ అయిన ఔన్సు పుత్తడి ధర తాజాగా 3218 డాలర్లకు దిగివచ్చింది. దీంతో దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,550కు తగ్గింది.

సోమవారం సాయంత్రం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.96,125 వద్ద ట్రేడయ్యింది. శనివారం రూ.99,950గా ఉన్న బంగారం ధర రూ.3,400 మేర తగ్గింది. వెండి సైతం రూ.200 తగ్గి రూ.99,700 వద్ద ట్రేడయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై టారిఫ్‌లతో విరుచుకుపడటంతో, చైనా సైతం ఏ మాత్రం తగ్గకుండా టారిఫ్‌లు పెంచుకుంటుపోయింది. తాజాగా 90 రోజుల పాటు టారిఫ్‌లు పెంపునకు బ్రేకులు పడ్డాయి.

అమెరికా తన సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించేందుకు అంగీకరించగా.. చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10 శాతం మాత్రమే సుంకం విధించేందుకు అంగీకరించింది. మరోవైపు రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి, భారత్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం తదితర అంశాలు బంగారం ధరలు తగ్గేందుకు ఉపకరించాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. దీనికితోడు డాలర్ ఇండెక్స్ సైతం పుంజుకొని మళ్లీ 101.76కు చేరడం కూడా మరో కారణమని పేర్కొంటున్నారు.