calender_icon.png 23 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో చేరిన జకియా ఖానం

14-05-2025 01:01:56 PM

అమరావతి: విజయవాడలోని బీజేపీ పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ జకియా ఖానమ్(YSRCP MLC Zakia Khan) భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(BJP state president Purandeswari), రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్.. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modiనేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరారని చెప్పారు. ముస్లిం సమాజం అభ్యన్నతికి సంబంధించి ప్రధాని మోదీ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.  వక్ఫ్ ఆస్తుల సంరక్షణ(Preservation of Waqf properties) కోసం వక్ఫ్ (సవరణ) చట్టం తేవడం, ముస్లిం మహిళలకు గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్​ నిషేధించడమే కాక పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ నినాదంతో సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.