14-05-2025 01:23:53 PM
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వ మీడియా(Chinese media X accounts) సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం షాకిచ్చింది. చైనా అధికార వార్తా సంస్థ షిన్హుహ, గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలను భారత్ లో నిషేధించింది. పాకిస్థాన్ కు అనుకూలంగా ఉన్నాయన్న ఆరోపణలతో భారత్ లో వీటిని బ్యాన్ చేశారు. తుర్కియే అంతర్జాతీయ వార్తాసంస్థ(ఎక్స్) ఖాతాను భారత్ లో నిలిపేశారు. తుర్కియేకు చెందిన టీఆర్ టీ వరల్డ్ ఎక్స్ ఖాతా(TRT World X Account) భారత్ లో బ్యాన్ చేసింది. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ చర్య జరిగింది. మే 7న, చైనాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మీడియా సంస్థను కేంద్రం గట్టిగా హెచ్చరించింది.
“ప్రియమైన గ్లోబల్ టైమ్స్ న్యూస్, ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని బయటకు పంపే ముందు మీ వాస్తవాలను ధృవీకరించాలని, మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేట్ చేయాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము” అని రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో అనేక పాకిస్తాన్ అనుకూల హ్యాండిళ్లు నిరాధారమైన వాదనలను వ్యాప్తి చేస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని భారత రాయబార కార్యాలయం( Embassy of India) పేర్కొంది. “మీడియా సంస్థలు మూలాలను ధృవీకరించకుండా అటువంటి సమాచారాన్ని పంచుకున్నప్పుడు, అది బాధ్యత, పాత్రికేయ నీతిలో తీవ్రమైన లోపాన్ని ప్రతిబింబిస్తుంది” అని రాయబార కార్యాలయం వెల్లడించింది. అంతకుముందు, మే 8న తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతా ద్వారా భారతదేశంలో 8,000 ఖాతాలను బ్లాక్ చేయాలన్న భారత ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్లు ప్రకటించింది.