14-05-2025 12:39:14 PM
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court)లో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్ వేశాడు. చంచల్ గూడ జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) జైలులో ఉన్నారు. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. మే 6న, కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీవీ శ్రీనివాస రెడ్డి, గనుల ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీ ఖాన్ సహా నిందితులను అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో దోషులుగా తేల్చి కోర్టు తీర్పు ఇచ్చింది. వారిద్దరినీ దోషులుగా తేల్చి ఒక్కొక్కరికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించింది.