01-10-2025 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్30 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వివేకానంద యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా దేవి నవరాత్రులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులకు 20116 రూపాయలు చందా అందజేశారు.
దుర్గాదేవి నవరాత్రులలో పాల్గొనడం తమ అదృష్టమని ప్రజలందరినీ సుఖసంతోషాలతో విలసిల్లెలా కరుణించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. కమిటీ సభ్యులు కృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు. కృష్ణారెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు రాసమల్ల యాదయ్య, చిలువేరు నరసింహ, చిలువేరు జున్ను, మినుగు గోపాల్, సంజీవ రెడ్డి, చిలుకూరి శ్రీనివాస్, కమిటీ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, సాయి, నరేష్, గొల్లూరి యాదగిరి పాల్గొన్నారు.