calender_icon.png 1 October, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సనత్ నగర్‌లో దుర్గామాత మండపాలను దర్శించిన ఎమ్మెల్యే తలసాని

01-10-2025 04:36:17 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఆయన బుధవారం ఆమీర్ పేట డివిజన్ లోని బాపూ నగర్ లో బస్తీ అధ్యక్షుడు హరిసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, గోపిలాల్ చౌహాన్, వనం శ్రీనివాస్, కూతురు నర్సింహ, గుడిగే శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

సనత్ నగర్ డివిజన్ లోని సి టైప్ క్వార్టర్స్ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సాయిబాబా నగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని కూడా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ బి ఆర్ ఎస్ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు రాజేష్ ముదిరాజ్, పీయూష్ గుప్త, ఫలహారం బండి మధు, అర్జున్ గౌడ్, సీనియర్ సిటిజన్స్ పార్థసారధి, అనంత రెడ్డి, మానిక్ పాటిల్, సహదేవ్ గౌడ్, సంజయ్ గౌడ్, కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.