01-10-2025 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా కార్యకర్తలందరూ తామే అభ్యర్థులుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి అన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల కోసం అందరు సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, భాస్కర నరసింహ, వంగరి రఘు, బండమీది కిరణ్, చిలువేరు వెంకటేశం, నందగిరి జగత్ కుమార్, గొల్లూరి యాదగిరి సాగర్, తదితరులు పాల్గొన్నారు.