26 August, 2026 | 2:53 AM

హఫీజ్‌పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ

26-08-2026 01:51 AM

సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. స్వర్ణ కుమారి మంగళవారం హఫీజ్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అందుతున్న ప్రాథమిక వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు పరిస్థితి, ఔట్పేషెంట్ సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేంద్రం పరిశుభ్రత వంటి కీలక అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రజలకు నాణ్యమైన, సకాల వైద్య సేవలు అందించాలంటే సిబ్బంది సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.ప్రతి రోగికి సమయానుకూల చికిత్స, అవసరమైన మందులు, ఆరోగ్య సలహాలు అందించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణలో అర్బన్ హెల్త్ సెంటర్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.ఈ సందర్శనలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి అక్రమ్, నేషనల్ హెల్త్ మిషన్ అధికారి డా. జ్యోతి బాయి తదితరులు పాల్గొన్నారు.