17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

12-04-2025 07:55 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ ఎక్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ మహాసభను జయప్రదం చేయాలని బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతన్ పల్లిలోని తన నివాసంలో చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ మహాసభ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించ నున్నట్లు తెలిపారు.

నియోజకవర్గం నుంచి వరంగల్ సభకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, పల్లె భూమేష్, వాలా శ్రీనివాసరావు, రిక్కుల మధుకర్ రెడ్డి, మేడి తిరుపతి, వేల్పుల రవి, రాంలాల్ గిల్దా, జాడి శ్రీనివాస్, రామిడి కుమార్, రెవెళ్లి ఓదేలు, అనిల్ రావు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.