calender_icon.png 5 December, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

05-12-2025 10:04:17 PM

రామగిరి సర్పంచ్ అభ్యర్థి చామల వాణి వెంకటరమణారెడ్డి

నకిరేకల్,(విజయక్రాంతి): రామగిరి గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని, ఈ సారి ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే రామగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రామగిరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చామలవాణి వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామగిరి గ్రామం లో చామలవాణి వెంకటరమణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొదటిసారిగా తాను సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే, గ్రామంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  మొగుళ్ళ శ్రీనివాస్, నిమ్మల కృష్ణమూర్తి, లోడంగి మహేష్, ఆకుల శ్రీనివాస్, నంద్యాల ప్రకాష్, యాదయ్య, సైదులు, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.