calender_icon.png 5 December, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి

05-12-2025 10:09:50 PM

మంథనిలో శ్రీపాద మార్గ్  4 లైన్ విస్తరణ పనుల వెగవంతం

మొదటి విడత పోలింగ్ ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

మంథని,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  మొదటి విడత పోలింగ్ జరిగే కమాన్ పూర్ , రామగిరి మంథని, ముత్తారం, శ్రీరాంపూర్ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సంబంధించి డిసెంబర్ 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని,  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని, బ్యాలెట్ పత్రాల ముద్రణ పంపిణీ నిబంధన ప్రకారం సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,  పంచాయతీ ఎన్నికల సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల, రిసెప్షన్ సెంటర్లో వద్ద ఏర్పాట్లు పై పలు సూచనలు చేశారు. 

మంథనిలో శ్రీపాద మార్గ్  4 లైన్ విస్తరణ పనుల వేగవంతం

మంథని పట్టణంలోని శ్రీపాద మార్గ్ 4 లైన్ విస్తరణ పనులు వేగవంతంగా కోనసాగించాలని,  అలైన్మెంట్ ను కలెక్టర్ పరిశీలించి ట్రెంచ్ కట్టింగ్ పనులు సజావుగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జడ్పీ సీఈఓ నరేందర్, తాసీల్దార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.