05-12-2025 09:58:36 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇన్ చార్జ్ విద్యాశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు తీసుకుంటుండగా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ సంబంధించి వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం మేరకు జూనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొత్తూరు హై స్కూల్ అనుమతి పునరుద్ధరణకు రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా, ఆయనతోపాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్, సెక్షన్ ఇంచార్జ్ గౌస్ ల ను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.